మల్కాజిగిరి గౌతమ్ నగర్ లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. గురువారం జిహెచ్ఎంసి చెత్త సేకరించే వ్యాను పార్కింగ్ చేసిన సిబ్బంది భోజనం చేసేందుకు వెళ్లారు. ఇంతలోనే ఒకసారిగా భారీ శబ్దం వచ్చింది. వెళ్లి చూడగా కొండమీద నుంచి ఓ పెద్ద బండరాయి విరిగిపడింది. ఈ ఘటనలో ఆ వాహనం తుక్కుతుక్కుంది. మరో బండరాయి కూడా విరిగిపడే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు.