గద్వాల్: ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు చట్టం ఏర్పాటు చేయాలి:బిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ కురువపల్లయ్య
నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించే విధంగా పార్లమెంటులో చట్టం చేయాలని బీఆర్ఎస్ నాయకుడు కురువ పల్లయ్య పేర్కొన్నారు. బహుజన రాజ్య సమితి బీసీ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం గద్వాలలో మేధావుల సమావేశం నిర్వహించారు. దేశంలో రోజురోజుకు ప్రభుత్వ రంగ సంస్థలు తగ్గి, ప్రైవేట్ సంస్థలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తే నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.