జమ్మలమడుగు: కొండాపురం : గండికోట జలాశయం నుంచి మైలవరం జలాశయానికి నీటి విడుదల నిలిపివేత
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని కొండాపురం మండలంలోని శ్రీ ఎద్దుల ఈశ్వర్ రెడ్డి గండికోట జలాశయం నుంచి మైలవరం రిజర్వాయర్ కు నీటి విడుదలను జలాశయం అధికారులు నిలిపివేశారు. శుక్రవారం తెల్సిన వివరాల మేరకు గండికోట జలాశయం పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా ప్రస్తుతం గండికోట జలాశయంలో 26.8 టీఎంసీల నీరు ఉన్నట్లు తెలిపారు. గండికోట జలాశయంలో పూర్తిస్థాయి నీరు నింపడం ఇది ఆరోసారి కావడం విశేషం.