ఖమ్మం అర్బన్: ఐక్యతా పోరాటమే ఏకైక మార్గం RTC SWFఉప ప్రధాన కార్యదర్శి గడ్డం లింగమూర్తి
ఆర్టీసీ కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కార్మికవర్గ ఐక్యతా పోరాటమే ఏకైక మార్గమని,భద్రాచలం డిపో కార్మికులు సాధించిన విజయం కార్మికవర్గ ఐక్యతకు విజయం సాధించడానికి నిదర్శనమని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఉప ప్రధాన కార్యదర్శి గడ్డం లింగమూర్తి పేర్కొ న్నారు. ఖమ్మం లోని సిహెచ్.వి.రామయ్య స్మారక భవనం వద్ద గుర్రం రామారావు అధ్యక్షతన ఏర్పాటైన ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అల్లం శెట్టి వెంకటేశ్వర్లు శ్వేతారుణ పతాకాన్ని ఆవిష్కరించారు.