ములుగు: మేడారం దర్శనం చేసుకుని వస్తుండగా పసర లో భక్తుడి పై ఎస్సై దాడి, విడియో వైరల్
Mulug, Mulugu | Sep 15, 2025 మేడారం సమ్మక్క-సార లమ్మను దర్శించుకొని వస్తున్న భక్తుడిపై ట్రైనీ ఎస్సై పుట్ట సతీశ్ చేయి చేసుకున్న ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా చౌరస్తాలో నిన్న ఆదివారం రోజున రాత్రి 8 గంటలకు చోటుచేసుకుంది. ఎస్సై భక్తుడిపై చేయి చేసుకున్న వీడియో సోషల్ మీ డియాలో వైరల్ గా మారింది. కుటుంబ సమేతంగా మేడారం వెళ్లి తల్లులను దర్శించుకొని వస్తున్న భక్తుడిని వాహనాల తనిఖీలో భాగంగా పస్రా పోలీస్ స్టేషన్ కు చెందిన ట్రైనీ ఎస్సై సతీశ్ ఆపాడు. ఈ క్రమంలో భక్తుడికి ఎస్సైకి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా ఎస్సై సతీశ్ సహనం కోల్పోయి భక్తుడిని కుటుంబ సభ్యుల ముందే చెప్ప చెల్లుమ నిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియ