ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలోని హాజీపురం గ్రామంలో మంగళవారం స్థానిక గ్రామ ప్రజలకు సైబర్ నేరాలు వివిధ అంశాలపై ఎస్సై మాధవరావు ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలు మరియు దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలిపారు. ఇంకా మీ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉంటూ వారు ఎటువంటి అలవాట్లు కలిగి ఉన్నారు. ఏమి చేస్తున్నారు అన్నది గమనిస్తూ ఉండాలన్నారు.