గోస్పాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శక్తి యాప్ పై విద్యార్థినిలకు అవగాహన కల్పించిన శక్తి టీం సభ్యులు
Nandyal Urban, Nandyal | Sep 23, 2025
నంద్యాల శక్తి టీం హెడ్ కానిస్టేబుల్లు డీఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ గోస్పాడులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులకు శక్తి యాప్పై మంగళవారం అవగాహన కల్పించారు. నంద్యాల ఏఎస్పీ జావలి ఆదేశాల మేరకు బాల్య వివాహాలు, ర్యాగింగ్, చైన్స్ స్నాచింగ్, ట్రాఫిక్ నిబంధనలు గురించి వివరించారు. 18ఏళ్ల లోపు అమ్మాయిలు, 21 సంవత్సరాల్లోపు అబ్బాయిలకు పెళ్లి చేస్తే చట్టరీత్యా నేరమని తెలిపారు.