గాజువాక: గాజువాకలో ఫుడ్ డెలివరీ బాయ్స్ మధ్య ఘర్షణలు, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన పోలీసులు
ఇన్సెంటివ్ విషయంలో డెలివరీ బాయ్స్ కు మధ్యన విభాగం వల్ల ఆదివారం మధ్యాహ్నం గాజువాక జంక్షన్ లోని ఓ ప్రధాని హోటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్విగ్గి జమాటో డెలివరీ బాయ్స్ కి ఇప్పటికే ఇన్సెంటివ్ తగ్గిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు దీంతో ఆదివారం శనివారం ఆర్డర్లు నిలుపుదల చేయాలని యూనియన్ తరపున అనుకున్నారు. ఈ మేరకు కొంతమంది ఆర్డర్లను తీసుకోవడానికి సిద్ధం కావడంతో హోటల్ ప్రాంగణంలో రెండు వర్గాలుగా విరిగిపోయి వాగు వాదం చేసుకున్నారు. ఆర్డర్లు చేయటానికి వీల్లేదు అంటూ అడ్డుకోవడంతో గొడవ జరిగింది.