అసిఫాబాద్: ధర్మకోల్ తెప్పలపై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న గుండి గ్రామస్తులు
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి సమీపాన ఉన్న గుండి గ్రామస్థుల ఇబ్బందులు వర్ణణాతీతం.పంటపొలాలకు వెళ్లాలన్నా... ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా..ఏచిన్న అవసరం వచ్చినా పెద్ద వాగు దాటాల్సిందే. మిగతా సమయంలో అయితే వాగు దిగి వెళ్లిపోవచ్చు. కానీ వర్షకాలం వచ్చిందంటే ప్రవాహం ఉద్ధృతంగా ఉంటుంది. ఏ అత్యవసరమొచ్చినా ఈ వాగు దాటాల్సిందే. వరద ఉద్ధృతి సమయంలో గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.శుక్రవారం గుండి గ్రామస్థులు థర్మకోల్ ఏర్పాటు చేసిన తెప్పలపై ప్రమాదకర స్థితిలో వాగు దాటుతున్నారు.