ఒంగోలు పట్టణ పరిసర ప్రాంతాలను బహిరంగ ప్రదేశాలను మద్యం తాగుతున్న మందు బాబులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు
Ongole Urban, Prakasam | Sep 16, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ పరిసర ప్రాంతాలను బహిరంగంగా మద్యం సేవిస్తున్న మందుబాబులకు మంగళవారం స్థానిక పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన వారిని గుర్తించి వారికి జరిమానా విధించడంతోపాటు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.