ఇచ్చోడ: పట్టణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే అనిల్ జాదవ్
గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని,వారికి కావాల్సిన ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందిస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు.శుక్రవారం ఇచ్చోడ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ ఎదుట ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు.రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని,వివిధ రకాల ఆహార పదార్ధాలతో క్యాంటీన్లు ఏర్పాటు చేయటం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.మహిళా శక్తి క్యాంటీన్ లలో ఆహారం అమ్మ చేతి వంటల ఉండాలని,నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు.