మంత్రాలయం: మంత్రాలయంలో శ్రీరాముడి చేత ప్రతిష్టించిన లింగానికి ప్రత్యేక పూజలు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
మంత్రాలయం: మండల కేంద్రం లోని శ్రీరాముడి చేత ప్రతిష్ఠించిన శ్రీ రామలింగేశ్వరుడి కి దీపావళి సందర్భంగా సోమవారం అర్చకులు రుద్రాభిషేకాలు, తుంగభద్ర జలాలతో జలాభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. చందనం విభూది మారేడు దళాలు పట్టు వస్త్రాలతో స్వామివారిని అలంకరించారు. 108 బిల్వపత్రాలతో శివ సహస్ర నామార్చన చేశారు. నైవేద్యాలు సమర్పించి మంగళ హారతులు ఇచ్చారు. స్వామివారిని అధిక సంఖ్యలో భక్తుల దర్శించుకున్నారు.