గంగాధర నెల్లూరు: జీడి నెల్లూరు నియోజకవర్గంలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం
జీడి నెల్లూరు నియోజకవర్గం, సుందర్రాజుపురం లోని విజయం ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ థామస్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించారు. విశిష్ట అతిథులు మాట్లాడుతూ రక్తదానం మరొకరికి ప్రాణదానం అని తెలిపారు.