రాయదుర్గం: పట్టణంలో మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించిన అధికారులు
మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుందని మలేరియా సబ్ యూనిట్ అధికారి నాగేంద్ర ప్రసాద్ తెలియజేశారు. రాయదుర్గం పట్టణంలోని కోట వీధిలో మహిళలు తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రత, ఫ్రైడే డ్రైడే పై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు తప్పనిసరిగా ఆహారంలో పాలు, పెరుగు, మజ్జిగ తీసుకోవాలన్నారు. ప్రోటీన్ ఉన్న పప్పులు, గుడ్లు, చేపలు, శనగలు తినాలని, కూరగాయలు, పండ్లు రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలన్నారు.