ఆందోల్: ఔరంగానగర్ పాఠశాలకు రోటరీ క్లబ్ చేయూత
రాయికోడ్ మండలం ఔరంగానగర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గురువారం రోటరీ క్లబ్ ఆఫ్ మంజీరా సంగారెడ్డి ఆధ్వర్యంలో క్రీడా దుస్తులు, బ్యాగులు, నోట్ బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మనయ్య, రోటరీ క్లబ్ అధ్యక్షులు కిషన్, సెక్రెటరీ అంజయ్య, పలువురు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశం, గ్రామ పెద్దలు, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు