అనంతపురంలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులు, ముగ్గురు వ్యక్తుల అరెస్టు, అక్రమ మద్యం స్వాధీనం
అనంతపురం నగరంలో ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం సాయంత్రం విస్తృతంగా దాడుల్లో నిర్వహించారు. రాష్ట్ర ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు దాడులు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 102 బాటిల్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యంపై పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ సిఐ సత్యనారాయణ తెలిపారు.