జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు
Ongole Urban, Prakasam | Nov 11, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మంగళవారం సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్ద చెర్లోపల్లి మండలంలో సీఎం చంద్రబాబు పర్యటించి పార్కులు ప్రారంభించారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు సత్కరించారు. తర్వాత ఇరువురు స్థానిక పరిస్థితులపై మాట్లాడారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొనేందుకు లింగన్నపాలెం గ్రామానికి సీఎం చంద్రబాబు తో పాటు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వెళ్లారు.