ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రమాదకరస్థాయిలో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు
Eluru Urban, Eluru | Sep 15, 2025
ఏలూరు జిల్లాలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు వాగులు వంకలు ప్రమాదకరస్థాయిలో ఉదృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కాలువలు కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం మండలాల్లో ఉన్న కాలువల ద్వారా ఎర్ర కాలువ జలాశయంలోకి 2012 క్యూసెక్కుల వరద నీరు వచి చేరుతుంది. దీనితో అదే 2012 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేసి లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.