గ్రావెల్ రోడ్డుకి భూమి పూజ చేసిన కోడూరు ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్
రైల్వే కోడూరు నియోజకవర్గం: ఓబులవారిపల్లి మండలం వై.కోట పంచాయతీ ఎద్దలవారిపల్లి గ్రామంలో గ్రావెల్ రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మరియు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రోడ్లు, నీటి, విద్యుత్ వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు తెలిపారు. కార్యక్రమంలో NDA నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.