తాటిపర్తి గ్రామంలో బావిలో రెండు మృతి దేహాలను గమనించిన స్థానికులు. పోలీసులకు సమాచారం
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో బుధవారం ఉదయం ఒక బావిలో రెండు మృతదేహాలు కలకలం రేపాయి. గ్రామ శివారులోని బావిలో రెండు మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పిఠాపురం సీఐ శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.