అనంతపురం నగర శివారులోని లెప్రసీ కాలనీ వద్ద ఈనెల 1వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పెద్ద కుల్లాయప్ప అనే వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.