వినుకొండలో విధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలికకు గాయాలు
వినుకొండలోని పలు గ్రామాల్లో వీధి కుక్కల దాడికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, పాదచారులు రోడ్ల మీదకు రావాలంటేనే భయపడుతున్నారు.సోమవారం సాయంత్రం 5గంటలకు పిట్టంబండలో కుక్కల దాడిలో ఐదేళ్ల బాలికతో పాటు ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. బాలికను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.