ప్రేమిస్తున్నానని ఓ అమ్మాయి వెంట పడడంతో.. ఆగ్రహించిన అమ్మాయి కుటుంబ సభ్యులు సదరు యువకుడికి దేహశుద్ధి చేశారు. దీంతో మనస్థాపానికి గురైన యువకుడు రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు రోహిత్ పై దాడి చేసిన వెంకటేశ్వర పురానికి చెందిన కరిముల్లా, హుమేరా, ఆసిఫ్, మహబూబ్, ఖదీర్, అల్తాఫ్ లను నవాబుపేట పోలీసు అరెస్టు చేసారు. రోహిత్ ఆత్మహత్యకు కారణం అవడంతో వారిని రిమాండ్ కి తరలించారు.