పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గం లో ప్రశాంత గ్రామాల్లో రాజకీయాలు ఏంటి టిడిపి నేతలు
పత్తికొండ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ సద్దుమణిగి ఎంతో కాలమైందని, వైద్య విద్య కళాశాలల ప్రైవేటీకరణ పేరుతో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి గ్రామాల్లో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని టీడీపీ నాయకులు నాగేంద్ర, నబి సాహెబ్, సాంబశివారెడ్డి, వెంకట రాముడు ఆదివారం ఆరోపించారు. చిట్యాలలో కోటి సంతకాల ప్రచారం పేరుతో రాద్ధాంతం చేశారని, వైద్య విద్య ప్రైవేటీకరణ గురించి ఫ్యాక్షన్ గ్రామాల్లో ప్రచారం అవసరమా అని ప్రశ్నించారు.