బాలికపై లైంగిక దాడి కేసులో ముద్దాయికి కోర్టు 7 ఏళ్లు జైలు శిక్ష, రూ.50,000 జరిమానా విధించింది.నంద్యాల రైతు నగరంలో 7 ఏళ్ల బాలికపై ఈ సంవత్సరం ఏప్రిల్ 25న లైంగిక దాడి జరగగా కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు గోవింద్ అనే వ్యక్తి నేరానికి పాల్పడినట్లు కోర్టుకు తెలిపారు. కోర్టు ముద్దాయిని దోషిగా తేల్చింది.