మంత్రాలయం: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రాలయం ఎమ్మెల్యే , మరియు వైసీపీ నాయకులు
మంత్రాలయం:కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి బోసేరాజు, తెలంగాణ మంత్రి వాకిటి శ్రీనివాసులుని బుధవారం మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, అనంతపురం జిల్లా వైసీపీ నాయకుడు శివరాం రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రాలయం పర్యటనకు వచ్చిన ఆయనను పద్మనాభ అతిథి గృహంలో కలిశారు. కర్ణాటక ఆంధ్ర రాజకీయాలపై ఇరువురు నాయకులు కాసేపు చర్చించారు. కార్యక్రమంలో వైసీపీ మండల నాయకులు భీమిరెడ్డి మురళి రెడ్డి ఉన్నారు.