యాడికి మండలం కొనుప్పలపాడు ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సుహాసిని రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ కు ఎంపికైనట్లు హెచ్ ఎం చిన్న పెద్దన్న చెప్పారు. శనివారం అనంతపురంలోని సైన్స్ సెంటర్లు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. సుహాసిని పాల్గొని ఇంటెలిజెన్స్ స్మార్ట్ గ్లాసెస్ అనే అంశాన్ని ప్రదర్శించింది. సుహాసిని ప్రతిభకు మెచ్చి రాష్ట్రస్థాయి కి ఎంపిక చేశారు. సుహాసినిని ఉపాధ్యాయుల అభినందించారు.