ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలోని కల్లూరివారిపాలెం పాలేరులో ట్రాక్టర్ మునిగిపోయిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గత కొన్నిరోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పాలేరుకి భారీగా నీరు చేరింది. కాగా పరుచూరివారిపాలెం నుంచి వ్యవసాయ పనుల నిమిత్తం కల్లూరివారిపాలెం వస్తున్న ఆంజనేయులుకు చెందిన ట్రాక్టర్ నీటిలో మునిగిపోయింది. కాగా జెసిబి సాయంతో ట్రాక్టర్ ను బయటికి తీశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.