చిత్తూరు గంగనపల్లిలో వ్యక్తి ఆత్మహత్య
Chittoor Urban, Chittoor | Sep 17, 2025
చిత్తూరు: ప్రియురాలి ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య చిత్తూరులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తవణంపల్లె మండలం దిగువమారేడుపల్లికి చెందిన దేవరాజులు (40) భార్య, పిల్లలను వదిలేసి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. 9ఏళ్లుగా గంగన్నపల్లికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఏమైందో ఏమో మంగళవారం సాయంత్రం ఆమె ఇంట్లోనే అతను ఉరేసుకున్నాడు. మొదటి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ నెట్టికంటయ్య తెలిపారు.