కుక్కలకు రేబీస్ టీకాలు వేయించండి: విక్రమ్ రెడ్డి కుక్కలకు రేబిస్ వ్యాధి నివారణ టీకాలు తప్పకుండా వేయించాలని తంబళ్లపల్లె పశువైద్యాధికారి విక్రంరెడ్డి కోరారు. ఆదివారం స్థానిక పశు వైద్యశాలలో ప్రపంచ జంతు సంక్రమిత వ్యాధుల (జూనొసిస్) దినోత్సవాన్ని సిబ్బంది, స్థానిక ప్రజలతో కలసి ఘనంగా నిర్వహించారు. అనంతరం పెంపుడు కుక్కలకు ఉచితంగా రాబీస్ వ్యాధి నివారణ టీకాలు వేశారు. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు, ముఖ్యంగా రాబీస్ వ్యాధి గురించి అవగాహన కల్పించారు.