పిఠాపురం యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం: డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల
బాబు
యోగా సాధన వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని డీసీసీబీ బ్యాంక్ ఛైర్మన్ తుమ్మల బాబు అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం అంబేడ్కర్ భవన్లో జరిగిన జిల్లా స్థాయి యోగాసన పోటీలను ఆదివారం ఉదయం 11 గంటలకు ఆయన ప్రారంభించారు. ప్రతి పాఠశాల, కళాశాలలో విద్యార్థి దశ నుంచే యోగాను అభ్యసించాలని సూచించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నలుమూలల నుంచి ఈ పోటీల్లో పాల్గొన్నారు.