ఖమ్మం అర్బన్: మంత్రి తుమ్మల క్యాంప్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్ల ఆందోళన
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయం ముందు అంగనవాడీ టీచర్స్ ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ తో పాటు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని తెచ్చిందిని. ఇంతటి ప్రమాదకరమైన విధానాలకు వ్యతిరేకంగా నిలబడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైన వుందిని. రాష్ట్ర ప్రభుత్వం దీనికి భిన్నంగా ఐసిడిఎస్ ను మొత్తం నిర్వీర్యం చేస్తున్నదిని ఆవేదన వ్యక్తం చేశారు.