మేడ్చల్: ఉప్పల్ స్వరూప్ నగర్ లో వృద్ధురాలి మెడలో నుంచి గొలుసు చోరీ
ఉప్పల్ స్వరూప్ నగర్ లో సోమవారము 60 ఏళ్ల వృద్ధురాలు మెడలో నుంచి 40 గ్రాముల బంగారు గొలుసును స్విగ్గి డెలివరీ బై వేషంలో ఉన్న యువకుడు అపహరించుకుపోయాడు. వెంటనే అప్రమత్తమైన వృద్ధురాలు, కాలనీవాసులు దొంగను వెంబడించి పట్టుకున్నారు. గొలుసు లాగడంతో వృద్ధురాలు మెడకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు దొంగలు విచారణ నిమిత్తం ఉప్పల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.