చిలుకూరు: జానకి నగర్ తండాలో ఎమ్మార్వో కారును అడ్డు తగిలిన గ్రామస్తులు, పోలీసుల మోహరింపు
ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఎమ్మార్వో కారుకు గ్రామస్థులు అడ్డు తగిలిన ఘటన ఇవాళ చోటుచేసుకుంది. చిలుకూరు మండల పరిధిలోని జానకీనగర్ తండా లో వ్యవసాయ భూమిలోకి వెళ్లే రోడ్డును కొలిచేందుకు రెవెన్యూ అధికారులు వెళ్లారు. అయితే, వచ్చిన అధికారులను సర్వే చేయకుండా ఓ వర్గం అడ్డుకోగా.. సర్వేను అడ్డుకున్నారని ఆరోపిస్తూ మరోవర్గం పరస్పరం ఘర్షణకు దిగారూ. దీంతో సర్వే చెయోద్దంటూ ఓ వర్గం చిలుకూరు ఎమ్మార్వో కారును అడ్డగించి ఏకంగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని అడ్డుకున్నారు. జానకీనగర్ తండాలో భారీనా పోలీసులను మోహరించారు.