జ్ఞానమ్మ కండ్రిగ హైవేపై ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ, ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధం, తప్పిన పెను ప్రమాదం
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం జ్ఞానమ్మ కండ్రిగ హైవేపై ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైన ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే పట్టణంలోని ఓ యువకుడు ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న సాగిస్తూ ఉండేవాడు హైవేపై వెళుతూ ఉండగా ఓ లారీ యూటర్న్ చేసుకునే క్రమంలో ఢీకొనడంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ద్విచక్ర వాహనం పూర్తిగా కాలిపోయింది లారీ డ్రైవర్ భయంతో పరారయ్యాడు అయితే ఇటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో అక్కడ స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు