మేడ్చల్: జవహర్ నగర్ లో లక్ష్మీనరసింహ కాలనీని సందర్శించిన ఎంపీ ఈటెల రాజేందర్
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చుట్టుపక్కల జిల్లాల నుంచి పొట్టచేత పట్టుకొని వేలాది మంది వచ్చి చిన్నపాటి నివాసాల్లో జీవిస్తుంటే కనీస వసతులు లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక లక్ష్మీనరసింహ కాలనీని వారు సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బూడిద వెంకటేష్, రాజు యాదవ్, కేకే చారి తదితరులు పాల్గొన్నారు.