సిర్పూర్ టి: ఆరెగూడ గ్రామంలో అంగరంగ వైభవంగా బులాయి వేడుకలు, భక్తిశ్రద్ధలతో జరుపుకున్న ప్రజలు
కాగజ్ నగర్ మండలం ఆరెగూడ గ్రామంలో బులాయి వేడుకలను గ్రామ ప్రజలందరూ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం దీపావళి పండుగ రోజు ఆదివాసి సాంప్రదాయాలతో భళాయి దేవతకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భాజా భజంత్రీలతో లయబద్ధంగా నృత్యాలు చేస్తూ గులాయి వేడుకల్లో పాల్గొంటామని గ్రామ ప్రజలు తెలిపారు. గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద ప్రత్యేక లైట్లు ఏర్పరిచి పాటలకు లయబద్ధంగా మహిళలందరూ నృత్యాలు చేశారు,