శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్ లో వాహనదారులకు పెద్దపులి తారసపడింది ,నల్లమల శ్రీశైలం ఘాట్ రోడ్లోని రహదారిపై ఓ పెద్దపులి భక్తులకు తారసపడింది, గురువారం అర్ధరాత్రి మల్లన్నను దర్శించుకుని కారులో హైదరాబాద్ వైపు వెళ్తున్న భక్తులకు శ్రీశైలం ఘాట్ రోడ్ లో పెద్దపులి రోడ్డుపై సంచరిస్తూ కనిపించింది. ఈ రోడ్డులో తరచూ పెద్దపులి, చిరుతపులి, ఎలుగుబంట్ల సంచారం అధికంగా ఉండడంతో, భక్తులు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు,