రేగోడు: ఆందోల్ నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న కుండ పోత వర్షం
Regode, Medak | Jul 21, 2025 మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని అల్లాదుర్గం టేక్మాల్ రేగోడు మండలాల్లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తోంది. పంటలకు సరిపడా వర్షం లేకపోవడంతో రైతులు బాధపడుతున్న సమయంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి రైతులు హర్షం వ్యక్తం చేశారు.