నిర్మల్: జిల్లా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన జిల్లా కలెక్టర్
Nirmal, Nirmal | Sep 17, 2025 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు పట్టణంలోని జిల్లా పరిషత్ (జెడ్పీ) కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఉద్యోగులకు, సిబ్బందికి తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు.ఈ వేడుకలలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జెడ్పి సీఈవో గోవింద్, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.