హనుమాన్ జంక్షన్ లోని పశువుల సంత ఎదురుగా ఉన్న 3 అంతస్తుల భవనంలో నివసిస్తున్న ఓ మహిళ బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతురాలి ముఖానికి కవర్లు కట్టి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. భార్యా భర్తల మధ్య గొడవలే ఘటనకు కారణమై ఉండొచ్చని చర్చ సాగుతోంది. మహిళ విజయనగరం, భర్త తిరువూరుకు చెందినవారు. ఘటన స్థలానికి క్లూస్ టీం, పెదపాడు పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.