కోవెలకుంట్లలో ఘనంగా గాడి చర్ల హరిసర్వోత్తమరావు జయంతి వేడుకలు
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్ల మండల శాఖ గ్రంథాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు, వందేమాతరం ఉద్యమ నేత, గ్రంథాలయ పితామహుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు 142వ జయంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, రిటైర్డు అధికారులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.