పీపీపీ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు నాగార్జున డిమాండ్
మెడికల్ కాలేజీల నిర్మాణంలో ప్రభుత్వ ప్రవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు నాగార్జున డిమాండ్ చేశారు. నిరుపేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా 19న పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నట్లు స్పష్టం చేశారు