గిద్దలూరు: స్కూల్ ఫెడరేషన్ క్రీడల్లో విద్యార్థులు పాల్గొనాలని సూచించిన రాచర్ల మండల విద్యాశాఖ అధికారి గిరిధర శర్మ
స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17, 18 వ తేదీల లో క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం రాచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారి గిరిధర శర్మ బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు వెల్లడించారు. మండలంలోని అన్ని పాఠశాలలకు చెందిన విద్యార్థులకు వాలీబాల్, బాడ్మిటర్, కబడ్డీ, క్యారమ్స్, చెస్, కోకో అథ్లెటిక్స్ క్రీడలలో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటుకోవాలన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లాస్థాయి క్రీడలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే స్పోర్ట్స్ కోఆర్డినేటర్లను సంప్రదించాలని విద్యాశాఖ అధికారి అన్నారు.