ఆర్మూర్: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ ఎంఈఓ కు వినతి అందజేసిన PDSU నాయకులు
ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవులలో ప్రైవేట్ విద్యా సంస్థలు క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి రాజా గంగారంకు శనివారం మధ్యాహ్నం 12:40 వినతిపత్రం అందజేసిన పిడిఎస్యు నాయకులు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు నరేందర్ ఆర్మూర్ ఏరియా అధ్యక్షులు నిఖిల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు దసరా సెలవులు ప్రకటించడం జరిగిందని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు వారిఇష్ట రీతిన ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి గతంలో తరగతులను నిర్వహించడం జరుగుతుందనీ అన్నారు. ఇప్పుడు మళ్లీ అలా జరగకుండా చూడాలని కోరారు.