పట్టణంలో పోషణ మాసం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు
శ్రీకాళహస్తిలో పోషణ మాసంపై అవగాహన శ్రీకాళహస్తి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ పోషణ మాస కార్యక్రమం నిర్వహించారు. పోషకాహారాలు తీసుకోవడం వలన కలిగే ఉపయోగాలను బాలింతలు, గర్భిణులు, మహిళలకు తెలియజేశారు. సీడీపీఓ శాంతి దుర్గా మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు ఈ కార్య క్రమాలు నిర్వహిస్తామన్నారు. పిల్లల్లో ఒబేసిటీ, పోషన్ బీ.. పడాయిబీ, తల్లిపాల ప్రాధాన్యత, పిల్లల పెంపకంలో తండ్రి పాత్రపై అవగాహన కల్పిస్తామన్నారు.