అధిక వరకట్న వేధింపుల ఘటనలో ఫిర్యాదు మేరకు కేసు నమోదు
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని దేవం వీధికి చెందిన మహిళకు కొత్తచెరువుకు చెందిన మహర్షి అనే వ్యక్తితో ఏడో నెల క్రితం వివాహమైంది. అయితే అధిక వరకట్నం తీసుకురమ్మని ఆమెను వేధిస్తుండడంతో బుధవారం ఆమె కదిరి పట్టణ పోలీస్ స్టేషన్లో భర్తతోపాటు అత్తమామలు, ఆడపడుచుపై ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసినట్టు కదిరి పట్టణ సిఐ నారాయణరెడ్డి బుధవారం తెలియజేశారు.