కీసర, అంకిరెడ్డిపల్లి గ్రామ శివారులలో ప్రభుత్వ భూములలో అక్రమంగా మట్టి తగుతున్నట్లు సమాచారం మేరకు పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ శాఖలు ఉమ్మడి దాడి చేశారు. ఈ దాడిలో ఒక హిటాచి, మూడు టిప్పర్ లారీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పారిపోగా కీసర పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. అక్రమ మట్టి తవ్వకం పై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.