మినీ బైపాస్ వద్ద అదుపుతప్పిన బైక్..ఓ వ్యక్తికి గాయాలు
నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన బైక్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. అతివేగమే ప్రమాదనికి కారణమని సమాచారం. క్షతగాత్రుని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన బుధవారం రాత్రి 8 గంటల సమయంలో జరిగింది