కర్నూలు: తమ గ్రామంలో భూ సమస్యలు పరిష్కరించండి: ఆస్పరి మండలం బిలేకల్ గ్రామానికి చెందిన ప్రజలు
తమ గ్రామంలో భూ సమస్యలు పరిష్కారం చేయాలని బిల్లేకల్ గ్రామ ప్రజలు జిల్లా అధికారులను కోరారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బిల్లేకల్ గ్రామానికి చెందిన వసంతరాయుడు, నెట్టికల్,ముక్కన్న వారి గ్రామంలో భూ సమస్య ఆక్రమణపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం ఉదయం 12 గంటలు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని మీడియాకు వివరించారు. బిల్లేకల్ గ్రామంలో 112 సర్వే నెంబర్ లో ప్రభుత్వానికి చెందిన 97 సెంట్ల స్థలం ఉందని అందులో 10 సెంట్ల స్థలంలో గ్రామానికి చెందిన కమ్యునిటి హాల్, మారెమ్మ,ఎల్లమ్మ గుడి నిర్మాణం చేపట్టారని తెలిపారు.